'ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి'

by Vinod kumar |
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను అదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుంచి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 48 అర్జీలను సమర్పించారు. అర్జీలను స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించుకొవడానికి ప్రజవాణి చక్కటి వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లక్ష్మి కిరణ్, కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రెహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed