మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి

by Anil Sikha |
మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి
X

దిశ, కొల్చారం: మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కొల్చారం మండలం అప్పాజీ పల్లి శివారులోని మంజీరా నది పాపాల మడుగు ప్రాంతంలో చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన మహబూబ్ మంజీరా నది పాపాల మడుగులో మంగళవారం చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి బోల్తా పడడంతో మహబూమ్ మృతి చెందాడు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed