నల్లమల ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి కొండా సురేఖ

by GSrikanth |
నల్లమల ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్‌ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా.. ఈ అనుకోని అగ్నిప్రమాదంపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed