హైదరాబాద్‌లో 1.65, రంగారెడ్డిలో 1.73 లక్షలు బోగస్ ఓట్లు: మర్రి శశిధర్ రెడ్డి

by Satheesh |
హైదరాబాద్‌లో 1.65, రంగారెడ్డిలో 1.73 లక్షలు బోగస్ ఓట్లు: మర్రి శశిధర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని బోగస్ ఓటర్ల ఏరివేతపై బీజేపీ దృష్టిపెట్టింది. అందులో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో బోగస్ ఓటర్లను తొలగించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, సభ్యుడు పొన్న వెంకటరమణ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఒక ఓటరు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నవారి పేర్లతో పాటు, ఒక ఓటరు రెండు జిల్లాలోని అసెంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పేర్లు నమోదు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అలా హైదరాబాద్ జిల్లా పరిధిలో నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పుర, బహదూర్ పురలోనే 1.65 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని వారు వినతిలో పేర్కొన్నారు.

అలాగే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర సెగ్మెంట్లకు చెందిన పలు ప్రాంతాల్లో 1.73 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు వెల్లడించారు. వీటిని ఏరేయాలని ఇరువురు నేతలు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ను కోరారు. అలాగే గతంలో ఇచ్చిన ఫిర్యాదులపైనా స్పందిచాలని వారు కోరారు. కాగా దీనిపై వికాస్ రాజ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు మర్రి శశిధర్ రెడ్డి, పొన్న వెంకటరమణ వెల్లడించారు.


Next Story

Most Viewed