హైదరాబాద్‌కు రానున్న T- కాంగ్రెస్ ఇన్ చార్జ్.. ఆ ఇద్దరు సీనియర్ల హాజరుపై సస్పెన్స్..!

by Satheesh |   ( Updated:2023-01-07 14:45:20.0  )
హైదరాబాద్‌కు రానున్న T- కాంగ్రెస్ ఇన్ చార్జ్.. ఆ ఇద్దరు సీనియర్ల హాజరుపై సస్పెన్స్..!
X

దిశ,డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా నియమితులైన మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ టూర్ ఖరారైంది. ఈ నెల 11న ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఠాక్రే పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం ఏఐసీసీ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా 11వ తేదీన ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, సీనియర్లు లీడర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, ఎక్స్ క్లూజీవ్ కమిటీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో విడివిడిగా భేటీ కానున్నారు. ఆ మరుసటి రోజు 12వ తేదీన ఉదయం డీసీసీ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం ఫ్రంటల్ సంస్థ అధ్యక్షులతో సమావేశం అవుతారు. అనంతరం వివిధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమావేశం అవుతారు.

అనంతరం 12వ తేదీనే తిరిగి ఢిల్లీ ప్రయాణం కానున్నారు. మాణిక్కం ఠాగూర్ స్థానంలో ఇటీవలే ఠాక్రేను ఇన్ ఛార్జిగా ఏఐసీసీ ప్రకటించింది. ఇన్ చార్జిగా ప్రకటించిన తర్వాత ఠాక్రే తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తొలి పర్యటనలోనే పార్టీలోని నేతలతో వేరు వేరుగా సమావేశం కాబోతుండటం ఆసక్తిగా మారింది. అయితే ఇన్నాళ్లు సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా సాగిన వ్యవహారం ఠాక్రే ఎంట్రీతో సమసిపోతుందా లేకా కలహాలు మునుపటిలా కంటిన్యూ అవుతాయా అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి సీనియర్లు 11వ తేదీన కొత్త ఇన్ చార్జి నిర్వహించే సమావేశానికి హాజరుపై సస్పెన్స్ ఏర్పడింది.

Advertisement

Next Story

Most Viewed