- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాళ్లలో చాలా మంది అంబేద్కర్‌ను ఎప్పుడో పక్కన పెట్టారు.. మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణను మాజీ ఎంపీ హర్ష కుమార్ అడ్డుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. హర్ష కుమార్ టీడీపీలో చేరడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం తప్ప ఆయన జాతి కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నా ఆ పార్టీ నేతలకు ఎందుకు బాధ అవుతుందో తెలియడం లేదని విమర్శించారు. దీనిపై అతి త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి నిలదీస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతున్న హర్షకుమార్ తన రాజకీయ అవసరాల కోసమే కులాన్ని వాడుకున్నారని, జాతి కోసం చేసిందేమి లేదని విమర్శించారు. మాల కులంలో రాజకీయంగా ఎదిగిన అనేకమంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని మందకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా 90% మంది మాలలు ఎమ్మార్పీఎస్‌కు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు చెబుతానన్నారు.