- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్లారెడ్డి యూనివర్సిటీలో జాతీయ విద్యా విధానం పై సదస్సు
దిశ, మేడ్చల్: మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, JNTUH సహకారంతో జాతీయ విద్యా విధానం 2020 (NEP) పై వైస్ ఛాన్సలర్ల సదస్సు జరుగుతుంది. రెండురోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఈ రోజు సదస్సులో జాతీయ విద్యా విధానం 2020 అమలుపై అంతర్జాతీయ దృక్పథం నుంచి భారతీయ విద్యా వ్యవస్థను శోధించడానికి వివిధ విద్యా సంస్థలు నుండి వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు, CEOలు, నిర్వహణ అధికారులు నాయకులు ఈ వేదిక ప్రయోజనకారిగా చేయడం ఈ సదస్సు లక్ష్యం అన్నారు.
అలాగే జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన అనేక అంశాలను చర్చింప జేసే కీలక ప్రసంగాలు & ప్యానెల్ చర్చలు, జాతీయ విద్యా విధానం 2020 అమలులో ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను పరిష్కరించడానికి ఈ సమావేశం లక్ష్యంగా ఇది భారతీయ విద్యా వ్యవస్థను మార్చడానికి, దానిని మరింత కలుపుకొని, వినూత్నంగా, పటిష్ఠంగా సమగ్రంగా మార్చడానికి ఉపకరిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ సమావేశం క్రింది అంశాలను లక్ష్యంగా చర్చించారు
అంతర్జాతీయ దృక్కోణం నుండి భారతీయ విద్యా విధానం NEP 2020 అమలులో సవాళ్లను గుర్తించడం, సమయానుకూలంగా సామాజిక అవసరాల పై దృష్టి సారించే ఫలితాల ఆధారంగా విద్య అమలు, NEP 2020 లక్ష్యాన్ని సాధించడానికి HEIలలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, అర్హత ఆధారిత క్రెడిట్ సిస్టమ్ మొబిలిటీ ఆన్‌లైన్ వనరులు, ఇంటర్ డిసిప్లినరీ/మల్టీ డిసిప్లినరీ, బహుళ నిష్క్రమణ ఎంపికలు, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC)విశ్వవిద్యాలయాలు & సంస్థల వర్గీకరణ తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా మంత్రి మల్లా రెడ్డి, మల్లారెడ్డి, యూనివర్సిటీ ఛాన్సలర్ చామకూర కల్పన, JNTU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, MRU వైస్ ఛాన్సలర్ డాక్టర్ VSK రెడ్డి, JNTU రెక్టార్ ప్రొ.ఎ.గోవర్ధన్, JNTU రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం. మంజూర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.