- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: యోగా మన జ్ఞానం, సంపద, జీవన విధానమని జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 25 రోజుల యోగా డే కౌంట్ డౌన్ కార్యక్రమంలో శనివారం కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక- ఉపాధి పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాళూభాయ్, సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమం హైదరాబాద్ లో జరగడం ఎంతో గర్వకారణమన్నారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.