- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి..
దిశ గద్వాల ప్రతినిధి, పెబ్బేరు/బిజినేపల్లి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం వల్ల పలు చోట్ల పిడుగులు పడిన వేరువేరు సంఘటనల్లో మహిళ, ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన గొర్రె కాపరి వంగూరు బాలయ్య, తన భార్య వంగూరు లక్ష్మి, కుమారుడు సందీప్ తో కలిసి తన గొర్రెలను మేత కోసం పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామ శివారులో తమ గొర్రెలను మేత వేస్తుండగా ఆకస్మికంగా అకాల వర్షం కురిసింది.
ఒక్కసారిగా పిడుగు పడడంతో భార్యాభర్తలు ఒక్కసారిగా కింద పడిపోయారు. కొంతసేపటికి చేరుకున్న బాలయ్య, అతని కుమారుడు సందీప్ తల్లిని లేపే ప్రయత్నం చేయగా.. ఆమె అప్పటికే మృత్యువాత పడినట్లు గా గుర్తించారు.
మరో ఘటనలో బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో గొర్రెలు మేపుతూ ఉన్న బాలకృష్ణ అనే యువకుడు పిడుగుపాటుకు గురై మరణించాడు. మరో ఘటనలో గట్టు మండల పరిధిలోని అరగిద్ద గ్రామంలో పిడుగు పడి గ్రామానికి చెందిన సాకలి జమ్మన్న (38)అనే రైతు మృతి చెందాడు. తెలకపల్లి మండలం గోపాల్ రావు నగర్ తండా లో పిడుగు పడిన సంఘటనలో ఒక ఎద్దు మృతి చెందింది. జిల్లాలో ఆకస్మికంగా కురిసిన వర్షాల కారణంగా మామిడి తోటలు, వరి పంటలకు నష్టం వాటిల్లింది.