- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రికార్డులు పరిశీలించిన తర్వాత లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పిస్తాం : వనపర్తి కలెక్టర్

దిశ,వనపర్తి: రామసముద్రం చెరువుకు సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పిస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు.శ్రీరంగాపురం మండల పరిధిలోని జానంపేట చెరువు నీటి వల్ల తమ భూములు మునుగుతున్నాయని, మునిగిన తమ భూములకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలంటూ చెరువు ఆయకట్టు రైతులు ఇదివరకు లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు,ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు.
జానంపేట గ్రామ రైతులు, పిటిషన్ దారులతో మాట్లాడారు.క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గమనించారు.చెరువు నీటి వల్ల తమ భూముల ముంపుకు గురవుతున్నాయని రైతులు కలెక్టర్ కు విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముంపుకు గురవుతున్న భూముల రికార్డులు పరిశీలించిన అనంతరం లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్.ఈ శ్రీనివాస్,సి సెక్షన్ సూపర్డెంట్ కిషన్, శ్రీరంగాపూర్ డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, సర్వేయర్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.