బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా..

by Ramesh Goud |   ( Updated:2025-04-20 14:18:41.0  )
బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా..
X

దిశ, వెబ్ డెస్క్/ చింతలపాలెం: చింతలపాలెం మండలం లోని కట్ట మైసమ్మ గుడి వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. కోదాడ నుండి నక్కగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదం సమయంలో సుమారు 65 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. పదిమందికి తీవ్రగాయాలు కాగా.. 108 సహాయంతో క్షతగాత్రులను హుటాహుటిన మేళ్లచెరువు, హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణంగా, బస్సు డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సును నియంత్రించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదం జరిగిన వెంటనే చింతలపాలెం యువత మానవత్వం చాటుతూ, సహాయ చర్యల్లో ముందుండి గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది.



Next Story

Most Viewed