ముగ్గురు మంత్రులు ఉన్న రైతుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు : ఎమ్మెల్సీ కవిత

by Kalyani |
ముగ్గురు మంత్రులు ఉన్న రైతుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు.. ఒక ఉప ముఖ్యమంత్రి.. ఇద్దరు మంత్రులు రైతుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిటాల లో భాగంగా ఆదివారం సాయంత్రం ఖమ్మం నగరంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాస గృహానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిన్న కూడా వాన బడి ధాన్యం తడిసి పోయి బస్తాలలో మొలకెత్తే పరిస్థితి ఉంటే మామిడి కాయలు అంత రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు కారుస్తూ ఉంటే కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం అన్నారు. ముఖ్యమంత్రి తర్వాతి పోస్ట్ ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఎంత బాధ్యత ఉండాలి ఎంత ఆలోచన ఉండాలి కానీ ఇప్పటివరకు రైతుల్ని కనీసం పలకరించలేదని అన్నారు.

ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం పోరు తప్ప, ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణమన్నారు. ఇంకా విచిత్రమైనది అంటే ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణమన్నారు. కమ్యూనిస్టులు ప్రభుత్వానికి బ్యాలెన్స్ గా ఉంటారని, కమ్యూనిస్టులను దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నదన్నారు. అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున మాట్లాడాలన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో పరిస్థితి చూస్తుంటే మరి ఆ నమ్మకం పోయిందన్నారు. ఎందుకంటే మరి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలే ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నందుకు ప్రజల పక్షాన ప్రభుత్వం పై ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఖమ్మం జిల్లాలో భక్త రామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటుతున్నా కొత్త ఆలోచనలు ఈ ఈ మంత్రులకు లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడి అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారని, అక్కడ ఇంటర్నెట్ లేదేమో అందుకనే ప్రభుత్వ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టలేదని ఎద్దేవా చేశారు. మా నాయకులు అందరికీ తెలుసు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాన పడిందంటే ప్రతి జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి ఎంత వాన పడింది ఏ నియోజకవర్గంలో పడింది ఏం జరుగుతుందని కనుక్కునేవారని ఆమె తెలిపారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రైతులందరికీ ఎకరానికి రూ.20 వేల చొప్పున ఈ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలి అన్ని రకాల పంటలను కూడా వచ్చి ఒకసారి అధికారులు చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిపాలన కంప్లీట్ గా పడకేసినటువంటి పరిస్థితి ఉంది, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి ములుగు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డ చచ్చిపోయినటువంటి శిశువును పైకెత్తి మంత్రులకు చూపించి హాస్పిటల్ కి పోతే మా బిడ్డ చనిపోయిందని చెప్పేటటువంటి దయనీయమైన పరిస్థితిలు ఉన్నాయన్నారు.

ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంటపడి ప్రజల ఆరోగ్యం బాగుండాలి విద్య బాగుండాలి రైతులు బాగుండాలి అని చెప్పిరు అవేవి కూడా చేయనటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి ఉందన్నారు. రైతుబంధు టకీ టకీ టకీ 31 లోపల పడ్తది అన్నారు. 31 అయిపోయింది మరి ఏప్రిల్ సగం అయిపోయింది సగం మందికి ఇంకా రైతు భరోసా రాలేదు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసిన ఘోరమైన అబద్ధాలు చెబుతున్నారు. ఇంతవరకు రైతు రుణమాఫీ 60 శాతం మందికి కాలేదని విమర్శించారు.

రెండున్నర లక్షల మంది రైతులు ఉంటే నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారని వారికి ఆత్మీయ భరోసా కల్పించలేదన్నారు. ఆ రైతు కూలీలకు పెడతా అన్న ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ఉందో హోర్డింగ్లకి అడ్వర్టైజ్మెంట్లకు తప్పితే ఇంతవరకు ఎవరికైనా పలకరించి నీకు ఆత్మీయ పథకం వచ్చిందంటే రాలేదని అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఏదైతే ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏమి చేయలేదు అన్నారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయ చేసి ఆలోచన చేసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రతినిధుల్ని నిలదీయాలి మా ప్రతిపక్షం ఏదైతే చక్కగా నిలదీసేటటువంటి పాత్ర పోషిస్తున్నదో మమ్మల్ని ఎంకరేజ్ చేయాలన్నారు. ఈ నెల 27వ తారీఖు నాడు 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ పండగ జరుగుతున్నది దీనికి ఖమ్మం జిల్లా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. పెద్ద ఎత్తున వచ్చి హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను అన్నారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed