- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారదులుగా బాధ్యతాయుతంగా పని చేయాలి

దిశ,వనపర్తి: జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారదులుగా బాధ్యతను నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్,మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం దిశగా చొరవ చూపాలన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగించుకోవచ్చునన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్ గుర్తు చేశారు. మిషన్ మధుమేహ, టీబీ స్క్రీనింగ్ వంటి కార్యక్రమాలతో ఉచితంగా ఇంటింటికి వెళ్లి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి సీతారాం,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసలు,ఐజేయు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు,సీనియర్ జర్నలిస్ట్ మాల్యాల బాలస్వామి మాటాడుతూ.. జర్నలిస్టులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను,కార్యక్రమాలను ప్రజలకు చేరుస్తూ చైతన్యం కలిగించాలన్నారు. జర్నలిస్టులు తమ ఆరోగ్యాల పై శ్రద్ధ వహించాలన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ఐజేయు యూనియన్ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీనువాసులు,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాయినాథ్ రెడ్డి,రామ చందర్ రావు,డాక్టర్ పరిమళ,మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు,వైద్యులు జర్నలిస్టులు పౌర్ణ రెడ్డి,కొండన్న,మాధవరావు లక్ష్మణ్,మణ్యం,తైలం అరుణ్ రాజ్ , గంధందినేష్,కుమార్,శ్రీనాథ్,తదితరులు పాల్గొన్నారు.