కలెక్టరేట్ ఎదుట వీఓఏలా ధర్నా ఉద్రిక్తం..

by Kalyani |   ( Updated:22 May 2023 8:51 AM  )
కలెక్టరేట్ ఎదుట వీఓఏలా ధర్నా ఉద్రిక్తం..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన కలక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. కాగా అదేసమయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటనలో వెల్దండ మండలం వీఓఏ వనిత సొమ్మసిల్లి పడిపోయారు. వీరికి మద్దతు తెలిపిన సీఐటీయూ నాయకులను సైతం స్టేషన్ కు తరలించడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed