- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్.. పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి
దిశ, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హజ్ యత్రికులకు నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. జూన్ మాసంలో వనపర్తి జిల్లా నుంచి 40 మంది హజ్ యాత్రకు ఎంపికయ్యారు.
మంగళవారం 36 మంది హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, పోలియో, ఇన్ ప్లూయంజా, మెనింజో కొకల్ వ్యాక్సిన్ లను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షుడు జోహెబ్ హుస్సేన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవిశంకర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్, డాక్టర్ పరిమళ, హెల్త్ ఎడ్యుకేటర్ మధు, ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మైనారిటీ నాయకులు ముస్లిం మైనారిటీ మత పెద్దలు పాల్గొన్నారు.