చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు

by Naveena |
చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు
X

దిశ, జడ్చర్ల : బాలానగర్ మండలం మూతి ఘనపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గంగాధర్ పల్లికి చెందిన శివకుమార్ (48) మూతి ఘనపూర్ పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా శివకుమార్ నిటా మునుగుతుండడంతో.. ఇది గమనించిన అతని వెంట చేపల వేటకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన యాదగిరి (22) అతడిని కాపాడే ప్రయత్నం చేస్తూ.. చెరువులో గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని గమనించి కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై లెనిన్ రెస్క్యూ సిబ్బందితో చెరువులో ఇద్దరి మృతదేహాల వెలికి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా చెరువు లోతు 20 ఫీట్లు ఉండడంతో.. గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

Next Story

Most Viewed