రెండు లారీలు ఢీ.. పూర్తిగా దగ్ధం

by Kalyani |   ( Updated:2022-12-07 14:43:45.0  )
రెండు లారీలు ఢీ.. పూర్తిగా దగ్ధం
X

దిశ, కొత్తకోట: ముందు ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి రెండు లారీలు దగ్ధం అయిన సంఘటన కొత్తకోటలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై నాగశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. షాద్ నగర్ నియోజకవర్గంలోని బూర్గుల నుంచి ఆయిల్ ట్యాంక్ లోడ్ తో కర్నూలుకు బయలుదేరింది. కొత్తకోట పట్టణంలోని 44 జాతీయ రహదారి స్విమ్మింగ్ ఫూల్ వద్దకు రాగానే ఎడమవైపు టైర్ పంక్చర్ అయింది. ఆయిల్ ట్యాంక్ లారీని పక్కకు నిలిపి టైర్ పంక్చర్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కంటైనర్ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. మంటలు బలంగా వ్యాపించి కంటైనర్ కు కూడా మంటలు వ్యాపించడంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story