- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో హంగ్ ఛాన్సే లేదు : శ్రీనివాస్ గౌడ్
దిశ,మహబూబ్ నగర్: మూడో తేదీ నాడు వెలువడే ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, 2018 లోనూ తమకు కేవలం 48 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్ లో అంచనా వేశారని అయితే అందుకు విరుద్ధంగా 88 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటినట్లు ఆయన గుర్తు చేశారు. ఆదివారం ఫలితాల్లోనూ ఇది రిపీట్ అవుతుందని తమకు 71 నుంచి 81 వరకు స్థానాలు వస్తాయని, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు మరోసారి పట్టం కట్టేలా చేస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ మత రాజకీయాలు, కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని తమ పార్టీ సీఎం కేసీఆర్ కుల మత రాజకీయాలకు అతీతులని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను హైదరాబాద్ లో ఉంచే ధైర్యం లేక వారిపై అపనమ్మకంతో బెంగుళూరుకు తరలిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అధిష్టానం గా ఉంటే ఇప్పుడు పక్కనే బెంగళూరు రూపంలో మరో అధిష్టానం జత అయిందని, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ చేతిలో తెలంగాణ కాంగ్రెస్ కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. ఆరు నూరైనా తెలంగాణ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి చంద్రశేఖర్, రాజేశ్వర్ గౌడ్, గంజి వెంకన్న, గోపాల్ యాదవ్, శాంతయ్య యాదవ్, కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, సి.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.