తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు

by Kalyani |
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు
X

దిశ, గట్టు, గద్వాల క్రైమ్: కన్న తండ్రినే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన గట్టు మండలం ఇందువాసి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన ఉరుకుందు(48), గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. ఆస్తిని పంచాలని తరచుగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగేది. ఆస్తి పంపకాల విషయంలో తండ్రి ఆలస్యం చేస్తున్నాడని కొడుకు వీరేష్ జీర్ణించుకోలేక పోయాడు.

ఉరుకుందు గ్రామంలోని ఓ దేవాలయం వద్ద నిద్రిస్తుండగా ఇదే అదునుగా భావించిన వీరేష్, తన తండ్రి ఉరుకుందును గొడ్డలితో నరికి చంపాడని తెలిపారు. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తుల ద్వారా విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై గట్టు ఎస్ఐని సంప్రదించగా కేసు నమోదు చేశామని, నిందితుడు పరారిలో ఉన్నాడని తెలిపారు.

Advertisement

Next Story