- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రింగ్ రోడ్ తాకట్టు పెట్టి కోట్లు దండుకున్నారు
దిశ, వీపనగండ్ల: గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికి ఇచ్చారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించారు.వనపర్తి జిల్లా గోవర్ధనగిరి లో మహిళ సమైక్య ఆధ్వర్యంలో..ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు లీజుకు ఆమ్మి..రైతులకు రైతుబంధు ఇచ్చారని ఆరోపించారు. గత పాలకులు చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ కట్టడమే సరిపోతుందని, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నట్లు తెలిపారు. తను మాట్లాడిన మాటలు నిజం కాదని బీఆర్ఎస్ నాయకులు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కొన్ని రోజులు ఆలస్యమైనా.. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని , గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేటిని కూడా రద్దు చేయకుండా ప్రజలకు మంచి జరిగే పథకాలను అందిస్తున్నామని అన్నారు. రైతు భరోసా పథకం కొంత ఆలస్యమైన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, రైతు రుణమాఫీ, గృహ జ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, రైతుబంధు మాజీ అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బాల్ రెడ్డి,రైతు నాయకులు నారాయణరెడ్డి, చక్ర వెంకటేష్,వెంకటస్వామి తదితరులు ఉన్నారు.