తపస్ ఆధ్వర్యంలో పేట కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల నిరసన..

by Sumithra |
తపస్ ఆధ్వర్యంలో పేట కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల నిరసన..
X

దిశ ప్రతినిధి, నారాయణపేట : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపస్ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి పదోన్నతులు లేనందున అనేక మంది ఉపాధ్యాయులు నిరాశతో ఉద్యోగ విరమణ చేశారని, బదిలీలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ప్రతి నెల 1వ తేదీ జీతం చెల్లించాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, ఉపాధ్యాయుల పాలిట శాపంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్, నరసింహ, జిల్లా నాయకులు కిషోర్ కుమార్, సీతారాములు, గుర్నాథ్ రెడ్డి, సురేష్ కుమార్, నాగార్జున్ రెడ్డి, తిరుపతయ్య, మాణిక్ ప్రభు, వెంకట్ రెడ్డి, రవీందర్, విశ్వనాథ్ రెడ్డి, రవికుమార్, లక్ష్మణ్, శంకర్ నాయక్, శ్రీనివాస్, రాజశేఖర్, చిన్న నరసింహులు, కృష్ణ, రాకేష్, అపర్ణ, సౌభాగ్య లక్ష్మి, విజయలక్ష్మి, తిరుపతి నాయక్, వెంకట్, రాములు, విష్ణు, భరత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed