- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలి
దిశ,బాలానగర్ : విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బాలానగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండడంతో దానిని పెంచాలని సూచించారు. 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.
మంచి మార్కులతో పాస్ కావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలని, కెరీర్ గైడెన్స్ క్లాసులను చెప్పించాలని, ప్రథమ శ్రేణి మార్కులతో పాసయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్సల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ లను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.