ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి మాట నిలుపుకున్నాం.. మంత్రి నిరంజన్ రెడ్డి

by Sumithra |   ( Updated:2023-10-25 09:54:29.0  )
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి మాట నిలుపుకున్నాం.. మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఎన్నికలలో వాగ్దానం చేసిన అభివృద్ది పనులను, నెరవేర్చి మాట నిలుపుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గురువారం సీఎం కేసీఆర్ హాజరుకానున్న ప్రజాఆశీర్వాద సభ ఏర్పాట్లను, హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం కు 2018లో ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ప్రారంభించుకున్నామని అన్నారు.

అదనంగా నర్సింగ్, పెబ్బేరులో మత్స్య కళాశాల, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసామని తెలిపారు. అలాగే ఐటీ పార్క్ శంకుస్థాపన ఏర్పాటు చేసుకున్నామన్నారు. వనపర్తి నియోజకవర్గంలో సుమారు 67 మినీ లిఫ్టులు, 15 చెక్ డ్యాంలు పూర్తి చేయడం ద్వారా లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. సమీకృత మార్కెట్, టౌన్ హాల్, వ్యవసాయ మార్కెట్, గోదాంలు, మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులు తిరుమల మహేష్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, కౌన్సిలర్ నాగన్న యాదవ్, డీఎస్పీ ఆనంద్ రెడ్డి, సీఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి రత్నం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed