Srisailam Project : శ్రీశైలానికి పరుగు పరుగున కృష్ణమ్మ..

by Sumithra |
Srisailam Project : శ్రీశైలానికి పరుగు పరుగున కృష్ణమ్మ..
X

దిశ, అచ్చంపేట : ఎగువ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం నుంచి వరదలు ఏ మాత్రం తగ్గకపోవడం గత నెల జూన్ 21 నుండి నేటి వరకు నిర్విరామంగా ఎగువ నుండి ఆల్మట్టి డ్యాం నుండి జూరాల సుంకేసుల బ్యారేజీ ద్వారా వరద ప్రవాహం ఏమాత్రం తగ్గకుండా కృష్ణమ్మ పరుగు పరుగున ఉరకలు వేస్తూ వరద ఉప్పెనెల కొనసాగుతూనే తరుణంలో ప్రాజెక్టులు నిండుకుండలా తొనికిసులాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో దాని దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు కృష్ణా జలాలు మరింత వేగంగా పోటెత్తుతూ గత 10 రోజులకు పైగా ఫ్లడ్ వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టులో 5 రోజుల నుండి 10 గేట్లను 20 అడుగుల పైకి ఎత్తి నాగార్జునసాగర్ వైపు నీటిని వదులుతున్న అధికారులు ఆదివారం కాస్త ఉదయం ఎగువ నుంచి తగ్గడంతో 12 అడుగులు పైకి ఎత్తి నీటిలో వదిలారు. తదుపరి మధ్యాహ్నం మరింతగా వరద ప్రభావం పెరగడంతో పది గేట్లను 15 అడుగులకు ఎత్తి దిగురా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో..

ఎగువ ఉన్న జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం నాటికి 4.87 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద జలాలు వస్తుండగా పై ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 4.28 లక్షలకు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద జనాలను అంచనా వేస్తున్న అధికారులు అప్రమత్తమౌతూ గేట్లను ఎత్తుతగ్గులను చేస్తూ ఉన్నారు.

ఆదివారం సాయంత్రం నాటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,42,628 లక్షల క్యూసెక్కుల వరద విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,824 క్యూసెక్కులు అలాగే సుంకేసుల బ్యారేజీ నుంచి 1,37, 039 లక్షల క్యూసెక్కుల వరద మొత్తంగా 4,00,491 లక్షల క్యూసెక్కులు వస్తుండగా శ్రీశైలం ప్రాజెక్టు వైపు 4,87, 451 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల సామర్థ్యం నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం నాటికి 882.90 అడుగులు చేరుకోగా 203.8909 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది.

సాగర్ వైపు..

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 క్రస్ట్ గేట్లను 15 అడుగుల ఎత్తి నీటిని 3.69, 250 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పరుగులు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 23,146 క్యూసెక్కులు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35, 315 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ వైపు వదులుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed