ఆరు గ్యారంటీలు ఇప్పటివరకు అమలు చేయలేదు : మన్నె శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
ఆరు గ్యారంటీలు ఇప్పటివరకు అమలు చేయలేదు : మన్నె శ్రీనివాస్ రెడ్డి
X

దిశ: రాజాపూర్: పార్లమెంట్ ఎన్నికల భాగంగా శనివారం రాజాపూర్ మండల కేంద్రంలోని జెకె ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో రాజాపూర్ బాలానగర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులో కుంటలు నింపి పంట పొలాలకు నీరు అందించామని అన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటిన 6 గ్యారంటీలను ఇంతవరకు అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని గడపగడపకు వెళ్లి ప్రచారం చేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్పిటిసి మోహన్ నాయక్, ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, యువ నేత చించోడు అభిమన్యు రెడ్డి, మాజీ సర్పంచ్ బచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed