- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
దిశ, వెల్దండ: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదులో జరిగిన శుభకార్యంలో వంట చేసి ముగించుకొని తిరిగి కారులో స్వగ్రామానికి వస్తుండగా తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని, హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారి తుమ్మలూరు గేట్ సమీపంలో (మ్యాక్) వద్ద గురువారం రాత్రి డీసీఎం కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే మృతి చెందారు. మృతులు వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన బైకెని యాదయ్య(34), ముంత శ్రీనివాసులు(30), హన్మంతు కేశవులు(35), లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాశి రామస్వామి(32)గా గుర్తింపు. ఈ దుర్గటతో ఆయా గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్థిక సాయం అందజేత
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదంపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ సంజీవ్ యాదవు, రైతు సమన్వయ అధ్యక్షులు భాస్కర్ రావు, బిఆరెస్ నాయకులు జంగయ్య యాదవ్, కిరణ్,అలీ, తానేష్,తదితరులు ఉన్నారు.