ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నం..

by Sumithra |
ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నం..
X

దిశ, గోపాలపేట : ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం నిలువ ఉన్న బియ్యంలో పురుగులు పడ్డప్పటికీ అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని బండపల్లి పీఎస్ పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పడ్డ బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారు. గత ఏడాది నిల్వఉన్న బియ్యం పూర్తిగా పిడతలు కట్టి బియ్యం అంతా పురుగులతో నిండాయి. సంబంధిత విద్యాధికారులు ఉపాధ్యాయులు పురుగులు పడ్డ బియ్యాన్ని వెనక్కి పంపించకుండా. అదే నిల్వ ఉన్న బియ్యాన్ని ఎండలో ఆరబెట్టి మళ్లీ వండి పెడుతున్నారు. ఇంత మహిళలు పిడతలు గట్టిన బియ్యాన్ని ఎండలో ఆరబెట్టి వాటిని మళ్లీ నీటిలో కడిగి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వండి పెడుతున్నారు.

అవి తిన్న విద్యార్థులు, అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరాలతో ఉన్న విద్యార్థులను తల్లిదండ్రులు ఆసుపత్రులకు తరలించారు. అక్కడి వైద్యులు విద్యార్థులను పరీక్షించి విద్యార్థులు కల్తీ ఉన్న ఆహారాన్ని తీసుకున్నారని దానివల్లే ఇలా అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కోపోగ్రస్తులై పురుగులు ఉన్న బియ్యంతో విద్యార్థులకు వండి పెడుతున్నారని ఉపాధ్యాయుల పై తల్లిదండ్రులు ఆగ్రహించారు. పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు కట్టిస్తారని మండిపడ్డారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న వనపర్తి జిల్లా యువజన కాంగ్రెస్ ఆర్టీఐ చైర్మన్ కుంకి రమేష్, పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు పడ్డ అన్నం విడతలతో నిండిన బియ్యం కనిపించాయి. ఈ విషయాన్ని వంట మహిళలతో మాట్లాడారు. సంవత్సరం నిల్వ ఉన్న బియ్యంలో పురుగులు పడ్డాయని వాటిని ఎండలో ఆరబెట్టి ఉండాల్సి వచ్చిందని వారికి తెలిపారు. ఈ విషయం పై ఆర్టీఐ చైర్మన్ కొంకి రమేష్ ఉపాధ్యాయుల పై ఆగ్రహించారు. ఎందుకు పాత బియ్యాన్ని వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వ ఉన్న బియ్యాన్ని వెనక్కి పంపి వెంటనే కొత్త బియ్యాన్ని తెప్పించాలని ఉపాధ్యాయులకు తెలిపారు.

Advertisement

Next Story