- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అగ్రకులాల రిజర్వేషన్ అతిపెద్ద తప్పిదం

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: భారత రాజ్యాంగం 103 చట్టాన్ని సవరణ చేసి అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించడం అతి పెద్ద తప్పిదమని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ ఆరోపించారు. ఆదివారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన యాదవ్ విద్యావంతుల వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జనాభాలో 15 శాతం ఉన్న అగ్రకులాల సంపన్నులు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు తీసుకోవడం శోచనీయం ఆయన విమర్శించారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న వారి కోసం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అనుసరించకుండా తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని బాలు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలో యాదవ విద్యావంతుల వేదిక శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో 1)యాదవ చరిత్ర-సంస్క్రతి, 2)ధరణి-భూభారతి-న్యాయ సమస్యలు, 3)యాదవ సమాజంలో మూఢనమ్మకాలు-బాల్య వివాహాలు, 4)రాజ్యాంగం-దాని ప్రాముఖ్యత, 5)కుల సంఘాలు-విద్య ప్రాముఖ్యత అంశాలపై ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జుర్రు నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ యాదవ్, వెంకట్ నర్సయ్య యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.