- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించిన పరిగి మాజీ ఎమ్మెల్యే: రామ్మోహన్ రెడ్డి
దిశ, మహమ్మదాబాద్: రాహుల్ గాంధీ గారు తలపెట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళుటకు హాత్ సే హాత్ జోడో యాత్రను గురువారం పూడూర్ మండలంలోని మన్నెగూడ నుండి పరిగి, దోమ, చౌడపూర్ , కుల్కచర్ల, మహమ్మదాబాద్, గండీడ్ మండలాల వరకు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మహమ్మదాబాద్ మండలంలోని గాదిర్యాల్ గ్రామంలో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే 2 లక్షల రుణమాఫీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, భూమిలేని నిరుపేదలకు భూపట్టాలు ఇస్తామని, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తామని తెలిపారు.
అక్కడ కెళ్ళి చౌదర్ పల్లి, మంగంపేట్,మొకర్లాబాద్, మహమ్మదాబాద్ మండలం, మరియు గండేడ్ మండలం కొంరెడ్డిపల్లి గండీడ్ మండల కేంద్రంలో హాత్ సే హాత్ జోడు యాత్రను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం. నారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కమతం విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రాధారెడ్డి, ఉమ్మడి గండీడ్ మండల లీగల్ సేల్ అధ్యక్షులు పుల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అభియాన్ సంఘటన్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంజీవరెడ్డి మాజీ కోఆప్షన్ నెంబర్ ఈసా బాస్రావి, మండల కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి రాఘవేంద్ర రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి పరిగి నియోజకవర్గంలోని 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.