నూతన సంవత్సరం వేల తీవ్ర విషాదం.. రోడ్డుప్రమాదంలో మిడ్జిల్ వాసి మృతి

by Mahesh |
నూతన సంవత్సరం వేల తీవ్ర విషాదం.. రోడ్డుప్రమాదంలో మిడ్జిల్ వాసి మృతి
X

దిశ, మిడ్జిల్: నూతన సంవత్సర వేడుకలను తన భార్య పిల్లలతో జరుపుకుందామని ఎంతో ఉత్సాహంగా కేక్ తీసుకొని వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషాదకరమైన ఘటన మిడ్జిల్ మండలంలో అర్ధరాత్రి 12 :15 తలకు చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు 25 డిసెంబర్ 31 సందర్భంగా ఆదివారం రాత్రి గ్రామంలో తన స్నేహితులతో కలసి ఆంజనేయులు వేడుకలు జరుపుకున్నారు. రాత్రి మిడిల్ మండల కేంద్రంలో తన అత్తగారి ఇంట్లో ఉన్న తన భార్య పిల్లల వద్దకు వెళ్లి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటానని తన స్నేహితులతో చెప్పాడు.

రాత్రి 11:30 కి ప్రాంతంలో మిడ్జిల్ మండల కేంద్రంలో ఉన్న తన భార్య రేణుకకు ఫోన్ చేసి తాను కేకు తీసుకొస్తున్నానని పిల్లలను నిద్రపోనివ్వకూడదని చెప్పి ద్విచక్ర వాహనంపై చిలువేరు నుండి రాణి పేటకు వెళ్లాడు. రాణిపేటలో కేకు తీసుకొని మిడ్జిల్ కు బయలుదేరగా మున్ననూర్ టోల్ ప్లాజా వద్ద ఉన్న 167 వ జాతీయ రహదారిపై ఉన్న కేఎల్ ఐ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి 12: 15 ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ విషయాన్ని కొద్దిసేపటి తర్వాత గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మృతుని వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా ఆంజనేయులు బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని మృతి చెందాడ లేక ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు మిడ్జిల్ పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను తన భార్య పిల్లలతో ఎంతో ఆనందంగా జరుపుకోవాలని బయలుదేరిన ఆంజనేయులు కొరకు ఎదురుచూసిన భార్య పిల్లలకు అత్యంత విషాదకరమైన వినాల్సి రావడంతో భార్య రేణుక పిల్లలతో తో పాటు కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. కాగా మృతుడికి ఇద్దరు ఆడ కూతుర్లు ఉండగా భార్య రేణుక ఆరు నెలల గర్భవతి. ఈ ప్రమాదం నూతన సంవత్సరం వేళ అటు చిల్వేర్ గ్రామంలో ఇటు మిడ్జిల్ మండల కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story

Most Viewed