ఖబర్దార్ రేవంత్‌రెడ్డి.. నీ కల్వకుర్తి రాజకీయాలు బంద్ చేసుకో : మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ స్ట్రాంగ్ వార్నింగ్

by Shiva |
ఖబర్దార్ రేవంత్‌రెడ్డి.. నీ కల్వకుర్తి రాజకీయాలు బంద్ చేసుకో : మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, మద్దూరు/కొత్తపల్లి: రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చకు రావాలని, ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను జిల్లాకు ఏం చేసానో రేవంత్ అడుగుతున్నాడని.. దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. మీడియా సమక్షంలోనే గద్వాలకు వెళ్దామని, ఇక్కడ కొడంగల్‌లో తిరిగితే.. ఎవరు ఏం చేశారో తెలుస్తుందని అన్నారు. అరుణమ్మ గెలుపును అడ్డుకునేందుకు రేవంత్ అండ్ టీం కుట్రలు చేస్తోందని అరోపించారు. ఒక్క ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలు గద్దల్లా మాటలతో తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఓ ఆడబిడ్డకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక పోతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం అయ్యాక రేవంత్ అడ్డగోలుగా మాటలు మాట్లాడుతున్నాడని, కల్వకుర్తి నుంచి వచ్చిన నిన్ను.. కొడంగల్‌‌లో గెలిపించారని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ చేతకాని రాజకీయాలు బంద్ చేసుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. మూడోసారి ప్రధాని కావడం పక్కా అని అన్నారు. డీకే అరుణమ్మను గెలిపిస్తే.. పాలమూరు అభివృద్ధి చెందుతుందని, పాలమూరు ప్రాజెక్ట్‌కు నిధులు వస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగురావ్ నామాజీ, మధన్, శంకర్, సుధాకర్‌రెడ్డి, వెంకటయ్య, రఘు, సాయిలు, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story