అట్టడుగు వర్గాల సంక్షేమమే మోడీ లక్ష్యం : డీకే అరుణ

by Disha Web Desk 11 |
అట్టడుగు వర్గాల సంక్షేమమే మోడీ లక్ష్యం : డీకే అరుణ
X

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్ : కుల సమాజంలో చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న దళితవర్గాల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతికి పాటుపడేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరేనని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం స్థానిక పద్మావతీ కాలనీలోని కాళికాంబ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎస్సీ మోర్చ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ తో కలిసి పాల్గొని ప్రసంగించారు. దళితుల చిరకాల కలగా మిగిలిన ఎస్సీ వర్గీకరణకై మోదీ గ్యారంటీ ఇచ్చాడని, మరి కొన్నాళ్ళు లో ఎస్సీ వర్గీకరణ కల నేరవేరబోతుందని తెలిపారు.

ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధి కేవలం బీజేపీ తోనే సాధ్యమని, ఎస్సీ సోదరులంతా బీజేపీ అభ్యర్థి అయిన తనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ,కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ …నేటి సమాజంలో దళితుల స్థితిగతులు మారుతున్నాయంటే అది నరేంద్ర మోడీ పాలన వలననే అని అన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పేరుతో విదేశీ విద్యకు ప్రోత్సాహం లభిస్తే, స్ట్రీట్ వెండర్ పేరుతో రుణాలు ఇస్తున్నది నరేంద్ర మోడీ అని అన్నారు. అరుణమ్మ గెలుపులో ఎస్సీ అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు పద్మజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed