- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు
దిశ, మహమ్మదాబాద్/గండీడ్: మండలంలోని కొంరెడ్డి పల్లి నుంచి హన్వడ్ మండలంలోని షేక్ పల్లి వరకు బీటీ రోడ్డును రూ, 3 కోట్ల 45 లక్షలతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ..రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయముతో ఉందని స్పష్టం చేశారు.
పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి గండీడ్ మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సల్కేర్ పేట్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సన్న వడ్లకు రూ,500 బోనస్ కూడా ప్రభుత్వం చెల్లిస్తూనే తెలిపారు. అదేవిధంగా గండీడ్ మండలంలో వెన్నచేడు గ్రామ చెరువులో ,సాలార్ నగర్ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యేని మత్స్య కారులు శాలువాతో పూలమాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం. నారాయణ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు నరసింహారావు, కొంరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, వెన్నచెడ్ మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి,గండీడ్ పిఎసిఎస్ చైర్మన్ జి. లక్ష్మీనారాయణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మాజీ కోఆప్షన్ నెంబర్ ఈసా బసవి ,మధు, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.