కొత్త హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు మంత్రికి ఎమ్మెల్యే వినతి..

by Kalyani |
కొత్త హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు మంత్రికి  ఎమ్మెల్యే వినతి..
X

దిశ, భూత్పూర్: నియోజకవర్గంలో ఉన్న పలు మండలాలకు మెరుగైన సేవలకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. శనివారం జడ్చర్ల లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే ప్రత్యేకంగా కలిసి సమస్యలను వివరించారు.

కొత్తకోట, మదనాపూర్ మండలాలకు సిహెచ్ సి సెంటర్లను ఏర్పాటు చేయాలని, అవసరమైన స్థలాలను గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యే తన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. కౌకుంట్ల, మూసాపేట, మదనపూర్ మండలాలకు అంబులెన్సులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Next Story