- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది: ఎమ్మెల్యే కొప్పుల
దిశ, మహమ్మదాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నంచర్ల గేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 12 మంది లబ్ధిదారులకు 6, 85,500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటుందని అన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, దేశాయి పల్లి సర్పంచ్ రఘు యాదవ్, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.