గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యంగా పల్లె దవాఖానాలు..MLA Chitttem Ram Mohan Reddy

by Javid Pasha |   ( Updated:2022-12-03 15:13:29.0  )
గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యంగా పల్లె దవాఖానాలు..MLA Chitttem Ram Mohan Reddy
X

దిశ, మక్తల్: మారు మూల గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభిస్తోందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.మక్తల్ నియోజకవర్గంలోని వడ్వాట్ గ్రామంలో పల్లె దవఖానను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని కోరారు. మిడి మిడి జ్ఞానంతో వైద్యం చేసే ఆర్ఎంపీ డాక్టర్లను నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు.


కృష్ణ మండల కేంద్రంలోని కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోటిన్నర నిధులు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రామ్ మనోహర్ రావు, జెడ్పీటీసీ వెంకటయ్య, మండల అధ్యక్షురాలు, వాడ్డేవాట్ సర్పంచ్, పార్టీ కార్యకర్తలు మధుసూదన్ రెడ్డి, గాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story