ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం..

by Naveena |
ఎంపీడీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం..
X

దిశ ,బిజినేపల్లి : మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయం (బ్లాక్ కార్యాలయం)లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగాయి. అయితే గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించగా..మంటలను అదుపు చేశారు. అప్పటికే కార్యాలయంలో భద్రపర్చిన పాత ఎన్నికల సామాగ్రి రూం, పక్కనే గోడ బయట ఉన్న టిఫైబర్ ఏసీ కేబుల్ వైర్ కాలి బూడిదయ్యాయి. అలాగే టేకు తలుపులు, కిటికీలు, పైకప్పు అంత అగ్ని ఆహుతి కావడంతో..దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరగవచ్చని పలువురు అంచన వేశారు. మంటలు అర్పుతున్న తరణంలో అందులో డెడ్ బాడీ కనిపించింది. మృతుడి వయస్సు దాదాపుగా 50 సంవత్సరాలు ఉంటుందని, డెడ్ బాడీ పూర్తిగా కాలడంతో ..గుర్తుపట్టలేక పోయామని అన్నారు. జూనియర్ అసిస్టెంట్ సుధీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

Next Story