- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector : కలెక్టర్ సారు మా గోస చూసి వెళ్ళండి...!
దిశ, ధరూర్ : మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి అంతా అస్తవ్యస్తంగా మారింది. ముందే వర్షాకాలం కావడంతో డ్రైనేజీలోకి వెళ్లాల్సిన మురుగు నీరు మొత్తం రోడ్లపై పారుతున్నాయి. చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఏర్పడింది. దోమల బెడద ఎక్కువై ఏ ఇంట్లో చూసినా దోమలు స్వైర విహారం చేసి ప్రజలను కాటు వేస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర జ్వరాలతో, డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రైవేటు దావఖానాలకు పోయి లక్షల్లో ఖర్చులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం మాత్రం గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టడం లేదు.
డ్రైనేజీ లోపంతో మురికి నీరు నిండుకుండలా నిండుకొని రోడ్ల పై పారుతున్న పూడిక తీయకపోవడంతో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తమ గోడును వెల్లబొసుకుంటున్నారు. ఎస్సీ, బీసీ, కోట్ల కాలనీలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. మురికి వాసన కంపుతో దుర్వాసన వెదజల్లుతుందని దోమలు పుట్టగొడుగుల పుట్టుకువస్తున్నాయని, దయచేసి ఈ విషయం పైన అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. చేసేదేమి లేక గ్రామ ప్రజలు సొంత ఖర్చులతో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి ఎవరి సమీపాల్లో వాళ్లే చల్లుకుంటున్నారు. అధికారులు గ్రామాన్ని సందర్శించకపోవడంతో పాటు ఇటు వైద్య బృందం కూడా పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్తులు వారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే సొంత ఖర్చుతో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి చల్లుకుంటున్నట్లు వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.