Krishna River : సంగమేశ్వరుడి ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణమ్మ..

by Sumithra |
Krishna River : సంగమేశ్వరుడి ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణమ్మ..
X

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలో సప్తనదుల ప్రదేశంలో కొలువైన అతిపురాతన సంగమేశ్వరాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం కృష్ణా నది జలాలు చుట్టూ ముట్టాయి. దీంతో ఆలయంలో ఎంతో విశిష్టమైన వేపధారు శివలింగానికి నడుము లోతు నీళ్ళలోకి ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘు రామశర్మ హరతినిచ్చారు. అలాగే నది జలాలకు సైతం ఆయన పూజలు చేశారు. ఎగువన కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి ఉప్పెనలా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.

శ్రీశైలం డ్యాంలో 840 అడుగులకు వరద జలాలు చేరడంతో సంగమేశ్వరాలయంలోని శివలింగాలు జలధి వాసమయ్యాయనీ ఆలయ ప్రధాన పురోహితుడు రఘురామ శర్మ తెలిపారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో నది జలాల నుంచి ఆలయం బయటపడి ఆరు నెలల పాటు రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల చేత నిత్య పూజలందుకోవడం ఆనవాయితీ. అయితే ఈమారు డిసెంబర్ నెల నుంచే నది జలాలు (రెండు నెలలు ముందుగానే )వెనుకకు వెళ్లాయి. దీంతో మరో ఆరు నెలలు పాటు సంగమేశ్వరుడు భక్తుల పూజలకు నోచుకోకుండా జలధివాసమైంది.

Advertisement

Next Story