- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసిఆర్ : భట్టి విక్రమార్క
దిశ,గద్వాల: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో మాజీ కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా శనివారం జిల్లా కేంద్రంలో జెడ్పి చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్, గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ హాజరయ్యారు. ధరూర్ రింగ్ రోడ్డు నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్ షో కొనసాగింది. అనంతరం పాత బస్టాండ్ నందు వైఎస్ఆర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... విభజన హామీలు మరిచిన బీజేపీ పార్టీని బొందపెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కుట్రలు పన్నుతూ రాజ్యాంగాన్ని మర్చి రిజర్వేషన్లు తొలగించడానికి 400 సీట్లు అడుగుతుందని,అలాంటి పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసే బాధ్యత నడిగడ్డ ప్రజలందరిదని అన్నారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాలను నాశనం చేసి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపారని ఆరోపించారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో రూ. ఒక లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను ఆదుకుంటామన్నారు. నడిగడ్డ ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న గట్టు ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపద అంత ఆదానీ, అంబానీలకు దోచిపెట్టి ఇచ్చారని, అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
జడ్పీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ ఇంచార్జీ సరిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ ల గురించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గొంతు చించుకుంటున్నాయని,కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్కొక్కరి ఖాతాలో జన్ దన్ యోజన కింద రూ.15 లక్షలు వేస్తామని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన బీజేపీకి, రూ.3016 రూపాయల నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇల్లు, రైతు రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ కు లేదన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని,మెజారిటీ స్థానాల్లో గెలిచి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ ని 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కిందని చెప్పారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పని చేసి నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లు రవి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్మన్ బండారి భాస్కర్, నాయకులు గట్టు తిమ్మప్ప, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి,గంజిపేట్ శంకర్, ధరూర్ జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి,మధుసూదన్ బాబు,ఇసాక్, అమరావాయి కృష్ణారెడ్డి,నల్లారెడ్డి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, అల్వాల రాజశేఖరరెడ్డి, ఆనంద్ గౌడ్, గట్టు కృష్ణమూర్తి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సీపీఐ ఆంజనేయులు, సీపీఎం వెంకటస్వామి, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.