- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ ఎదుగుదలను ఓర్వలేకే కవితపై ఈడీ కేసులు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల : సాంప్రదాయం, హిందుత్వం పేరుతో బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని, గడచిన తొమ్మిదేళ్ల పాలనలో 5 వేల ఈడీ కేసులు నమోదు అయితే అందులో ఒక్క బీజేపీ నేత కూడా ఉండకపోవడం శోచనీయమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈడీ కేసులు నమోదైన వారు బీజేపీలో చేరితే ఈడీ కేసులని మాఫీ అవుతాయని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన అదానీ మీద మోడీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
భవిష్యత్తులో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రత్యమ్నాయంగా తయరవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడి చేయిస్తున్నారని బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తూ తమ పార్టీలో చేర్పించుకుంటున్నారని, పార్టీలో జాయిన్ కానివాళ్లను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతి పక్షాలపై తప్పుడు కేసులను వాదించలేక ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రానా తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే బీజేపీ లిక్కర్ స్కామ్ ను ముందుకు తీసుకొచ్చిందన్న ఆయన.. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ను డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక కవితను ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎంపీగా ఉంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మహిళలను కించపరిచే విధంగా కవితా పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఈడీ అధికారుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీత్ చందర్, కౌన్సిలర్లు లత, ప్రశాంత్ రెడ్డి, ఉమా శంకర్ గౌడ్, రమేష్ ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్ ఖాన్, ప్రీతం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మోహన్ బృందం గోపాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.