- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరులో ప్రజాస్వామ్యం ఉందా..? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
దిశ,మహబూబ్ నగర్: పాలమూరులో ప్రజాస్వామ్యం ఉందా? ఏ కారణం లేకుండా కాంగ్రెస్ కార్యకర్త ఆనంద్ గౌడ్ ను బైండోవర్ పేరు మీద డీఎస్పీ కార్యాలయానికి పిలిపించడం ఏమిటని మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు,స్థానిక 21 వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ను బైండోవర్ పేర స్థానిక డీఎస్పీ కార్యాలయానికి పిలిపించిన విషయం తెలుసుకొని ఆయన డిఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు నచ్చిన పార్టీలోకి మారకూడదా? పార్టీ మారితే బైండోవర్ చేస్తారా? ఒకరి కోసం పోలీస్ యంత్రాంగం వ్యవస్థను నాశనం చేస్తున్నారని, నియమ నిబంధనలు లేవా అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నారని,డిఐజీ,ఎస్పీ లకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. సీనియర్ నాయకుడైన ఆనంద్ గౌడ్ ఎన్నికల ప్రచార భాద్యతలు నిర్వర్థిస్తున్నారనే అక్కసుతో అతనిపై అక్రమ కేసులు బనాయించి ప్రచారానికి ఆటంకం కలిగిస్తే చూస్తూ కూర్చోలేమని హెచ్చరించారు. ఈ విషయమై తాము,తమ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా తీసుకొని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వినోద్,ఎన్పీ వెంకటేష్,ఫయాజ్,అజ్మతలీ తదితరులు పాల్గొన్నారు.