డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పై విచారణ షురూ : కలెక్టర్

by Kalyani |
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పై విచారణ షురూ : కలెక్టర్
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: రెండు పడకల గదుల కేటాయింపుల ఇళ్ల పై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల అర్హత నిర్ధారణకు గాను విచారణను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ తెలిపారు. ఇందుకుగాను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల సిబ్బంది 18 మందితో బృందాలను ఏర్పాటు చేసినట్లు,వారం రోజుల్లో ఈ బృందాలు వారి విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన వారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ముందుగా మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర పట్టణ ప్రాంతాలలోని రెండు పడకల గదుల్లో నిజమైన లబ్ధీదారులే నివాసం ఉంటున్నారా? లేదా? అని,సొంత గృహాలు లేనివారికే కేటాయించారా? లేదా? అని ఈ బృందాలు విచారణను నిర్వహించి పూర్తి వివరాలను సేకరించి, తామిచ్చిన 40 కాలమ్స్ గల ప్రొఫార్మా లో పొందుపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Advertisement
Next Story

Most Viewed