- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Illegal : గుట్టలు గాయాబ్.. కనిపించని అధికారుల పర్యవేక్షణ..
దిశ, గుండుమాల్ : నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండల కేంద్రంలో గుట్టలను అక్రమంగా తొలిగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుండుమాల్ లోని సర్వేనెంర్ 171లో 208.15 ఎకరాల గుట్ట ఉంది. అందులో దాదాపు 100 ఎకరాలకు 30 ఏండ్ల క్రితమే ఇళ్ల నిర్మాణాలకు, సాగు చేసుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మిగిలిన 100 ఎకరాల్లో గుట్ట ఉన్నది. ప్రస్తుతం అక్రమార్కుల కన్ను గుట్ట పై పడింది.
ప్రభుత్వ పనుల కోసమని తవ్వకాలు..
ప్రభుత్వ పని అయినా గుత్తేదారు రాయల్టీ చెల్లించి తరలించాలి. కానీ ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో మట్టి, ఇసుక ఇష్టానుసారంగా ప్రభుత్వ పనులకు వాడుకుంటున్నారు. ఇక్కడి రాజకీయ నాయకుల అండదండ, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో కొంత మేర గుట్టలు కనుమరుగయ్యాయి.
గుట్టలు తవ్వి మట్టిని అమ్ముకొని కోట్లరూపాయలు గడిస్తుండగా కొందరు నాయకులు. తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ దారుల్లో గుట్టను చదును చేసి స్థలాలను అమ్ముకుంటున్నారు. అంతే కాదు అదే స్థలంలో ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు చోటా నాయకులు, బడా నేతల అండదండలతో వారు గుట్టలను పిండి చేస్తున్నారు. ప్రభుత్వనికి కోట్ల రూపాయల నష్టం కలిస్తున్నారు. ఈ దందా సాగిస్తున్న మాఫియాకు కొడంగల్ లో అడ్డేలేదు. ఈ తతంగం అంత రెవెన్యూ మైనింగ్, అధికారుల కనుసన్నళ్ళో పనిచేస్తుండటంతో ఈ దుస్థితి నెలకొందని విమర్శలున్నాయి.
గుండుమాల్ తహశీల్దార్ వివరణ..
గుట్టల వద్ద మట్టిని తవ్వుతున్నారని, ఖాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ పనులు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అనుమతులు లేకుండా గుట్టను తవ్వినా, మట్టిని అమ్ముకున్న కేసులు నమోదు చేస్తామంటున్నారు తహశీల్దార్ భాస్కర్ స్వామి.