- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ను నమ్మితే గోసపడతాం : ఎమ్మెల్యే ఆల
దిశ, కొత్తకోట: కాంగ్రెస్ ను నమ్ముకుంటే నట్టేట్ల ముంచుతుందని, కాంగ్రెస్ ని గెలిపిస్తే మనమంతా గోసపడతామని దేవరకద్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోట మండలంలోని కానాయపల్లి, ఈదుల భావి తాండా, సంకిరెడ్డిపల్లి, రాయన్ పేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… 3 గంటల కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్ కావాలా.. 24గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా మీరే ఆలోచించాలని, పంట పండితే ఇంటికి వచ్చి వడ్లు కొనేది కారు గుర్తు ప్రభుత్వమన్నారు.
మీ ఊరు రెండు సార్లు నాకు మంచి మెజార్టీ ఇచ్చింది. ఈ సారి కూడా 100 శాంతం మెజార్టీ ఇవ్వాలని, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి సంక్షేమం చాలా బాగుందని తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ ఉన్నంత వరకు దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఆగవన్నారు. ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సాయం చేశామని, లబ్దిపొందిన ప్రతి ఒక్కరూ కేసీఆర్ మొఖం చూడాలని కోరారు.
మీ గ్రామానికి మరిన్ని నిధుల ద్వారా అభివృద్ధి చేసుకుందామని, కలిసికట్టుగా పని చేద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్ అండ్ ఆర్ సమస్యను పరిష్కరిస్తామని ఎవరు కూడా అధైర్య పడద్దని నిర్వాసితులను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రెడ్డి, కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సర్పంచ్ లు సుదర్శన్ రెడ్డి, ఆకుల శ్రీనివాసులు,కొండారెడ్డి, సాక బాల నారాయణ,గాడిల ప్రశాంత్, భీమ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.