- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెంచుపెంటలో నాలుగు పూరి గుడిసెలు దగ్ధం
దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని నల్లమల అడవిలోని లోతట్టు ప్రాంతమైన రాంపూర్ చెంచుపెంటలో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా నాలుగు పూరిగుడిసెలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి నాలుగు పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సర్పంచ్ బాల గురువయ్య వివరాల ప్రకారం.. నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలోని రాంపూర్ పెంటకు చెందిన చిగుర్ల లక్ష్మయ్య, నిమ్మల పాపయ్య, నిమ్మల బాలమ్మ, మరియు మినీ అంగన్వాడీ గుడిసె పూర్తిగా దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో గుడిసెలకు మంటలు అంటుకుని ఆ గుడిసెలు పూర్తిగా దగ్ధమైనట్లు వారు తెలిపారు. ఈ ఘటనలో సుమారు విలువైన 3 సోలార్ లైట్‌లతో.. ఇంట్లోని వంట సామానుతో సహా బీరువాలు, ఇతర సామాన్లు పూర్తిగా దగ్ధమై సుమారు 3 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబ సభ్యులు ప్రాణాలను వారి చేతిలో పెట్టుకొని బయటపడ్డారు.
మంటలతో అయోమయంలో గిరిజనులు
నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలోని రాంపూర్ చెంచుపెంటలో మొత్తం 25 కుటుంబాలు ఉన్నాయి. పూరి గుడిసెలను ఆధారంగా చేసుకుని తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో గిరిజనుల గుడిసెలలో తరచుగా మంటలు అంటుకుని కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఘటనలను చూసి ఆ గిరిజనులు అయోమయంలో పడుతున్నారు. అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నవారి గుడిసెలు రెండు మూడు రోజులకు తరచుగా కాలిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వం తమపై దయవుంచి తమను ఆదుకుని తమకు పక్కా ఇల్లు కట్టించాలని ఆ గిరిజనులు కోరుతున్నారు.
- Tags
- huts