- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గృహ యజమానులకు నష్టం కలగకుండా చూడాలి

దిశ, నారాయణపేట ప్రతినిధి : రోడ్డు వెడల్పు పనులలో గృహ యజమానులకు నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ మీటింగ్ హల్ లో కోస్గి రోడ్డు వెడల్పు పనులపై తహసీల్దార్ మున్సిపల్ అధికారుల ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయే వారితో నెగోషియేషన్ సమావేశం( DLNC )నిర్వహించారు. దాదాపు 40 మంది హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రూ.4200 స్క్వేర్ యాడ్ ప్రకారం రెసిడెన్షియల్ ప్లాట్స్ కు, రూ. 11,600 కమర్షియల్ షాప్ లకు నష్టపరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా 188 మందికి గాను, 165 మంది ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం తీసుకొనుటకు సమ్మతి తెలిపినారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలం , SE R & B, ఆర్డీవో రామచందర్ రావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారుల డైరీనీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. శాఖ పరంగా ఏ విధమైన సహకారాన్ని అయిన అందించడానికి ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని కలెక్టర్ తెలిపారు.