Jurala Dam : జూరాలకు భారీగా వరద ప్రవాహం.. 12 గేట్లు ఎత్తివేసిన అధికారులు

by Mahesh |   ( Updated:2023-07-27 09:32:34.0  )
Jurala Dam : జూరాలకు భారీగా వరద ప్రవాహం.. 12 గేట్లు ఎత్తివేసిన అధికారులు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కర్ణాటకలోని నారాయణపురం రిజర్వాయర్, ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి గంట గంటకు పెరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 42 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు. వరద ప్రవాహ తీవ్రత గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు 12 గేట్లను ఎత్తివేసి 76 వేల 578 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి విద్యుత్తు ఉత్పత్తిని ఆరంభించారు. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమా ప్రాజెక్టుకు 650 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల ద్వారా విడుదల చేశారు. జిల్లాలో వర్ష తీవ్రత, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో ప్రాజెక్టు ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నిండగలదని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed