జూరాలకు మళ్లీ పెరిగిన వరద

by Nagam Mallesh |
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
X

దిశ,గద్వాల: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు భీమా నది నుండి వస్తున్న వరదతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. కర్ణాటక జలాశయాలు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో ఎగువ నుంచి జూరాల‌ ప్రాజెక్టుకు 3,15,000 క్యూసెక్కుల వదర వచ్చిచేరుతోంది. దాంతో అధికారులు ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.960 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్టంగా 9.65 టీఎంసీలకు గాను 8.531 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గురువారం రాత్రి జూరాల ప్రాజెక్టుకు 3.15 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలానికి 3.35 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed