నల్లమల్ల ఏ‌టీఆర్ అడవికి కార్చిచ్చు.. పెద్ద మొత్తంలో అడవి దగ్ధం

by Dishadaily Web Desk |
నల్లమల్ల ఏ‌టీఆర్ అడవికి కార్చిచ్చు.. పెద్ద మొత్తంలో అడవి దగ్ధం
X

దిశ, లింగాల : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ( ‌ఏటీఆర్ ) నల్లమల అడవుల్లో పెద్ద మొత్తంలో అడవి దగ్ధమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని అడవిలో కార్చిచ్చు మొదలై లింగాల అచ్చంపేట మన్ననూర్ నుంచి దోమలపెంట రేంజ్ పరిధిలో గల అడవిలో మంటల వ్యాప్తి కొనసాగుతున్నట్లు తెలిసింది. అడవి‌లో చెలరేగిన మంటలను శాటిలైట్ ద్వారా అడవి శాఖ అధికారులు గుర్తించి పలు ప్రదేశాల్లో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.

అలాగే లింగాల మండలంలోని పాత ధారారం శివారులో అడవి ప్రాంతంలో మంటల వ్యాప్తి బుధవారం చోటుచేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించి మంటలు చెలరేగుతున్న ప్రదేశాలకు ఫైర్ సేఫ్టీ సిబ్బందిని పంపించి మంటలను నియంత్రించే ప్రయత్నం చేశారు.

పెద్ద మొత్తంలో అడవి దగ్ధం..

నల్లమల అడవి ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు శాటిలైట్ ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ముందుగా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో నీ ఎద్దుల బండ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అడవి సంపద సేకరణకై వచ్చి నిప్పు పెట్టినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఎఫ్ ఆర్ ఓ వీరేశం తెలిపారు. సమాచారం తెలుసుకున్న అడవి శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి ఇచ్చామని తెలిపారు. అడవి లో చెలరేగిన మంటలు మానవాళికి నియంత్రించే శక్తి చాలా తక్కువ ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నుండి దోమలపెంట రేంజ్ వరకు అడవి పెద్ద మొత్తంలో దగ్ధం అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ శ్రీశైలం వెళ్తున్నా వాహనదారులకు పొగమంచు పెద్ద మొత్తంలో వ్యాప్తి చెందడంతో వాహనదారులు సైతం ఇబ్బందులు పడ్డారని తెలిసింది. లింగాల కొల్లాపూర్ రేంజి పరిధిలో రాత్రి పొద్దుపోయే వరకు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అటవీశాఖ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కృషి చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story